చెన్నారావుపేట: లారీ ఢీకొని బాలుడి మృతి
By vidyasagar 71చూసినవారువరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లయ్య బోడు తండాలో విషాదం చోటుచేసుకుంది. పుల్లయ్య బోడు తండాలో మంగళవారం లారీ ఢీకొని 8 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, స్థానికులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.