పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని అంగన్వాడి టీచర్ పి విజయలక్ష్మి పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో శనివారం అమ్మ మాట -అంగన్వాడి బాట అనే కార్యక్రమాన్ని పిల్లలు తల్లులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో ప్రీస్కూల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తామని అన్నారు.