వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరానిపాడులోని ఎన్టీఆర్ సర్కిల్లో గురువారం నర్సంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి నర్సింగరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల ప్రమాద భీమా కల్పించినందున సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.