చిన్నపాటి వర్షానికి రోడ్లపై డ్రైనేజీ నీరు

84చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం కురిసిన చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలన్ని పొంగిపొర్లి ప్రధాన రహదారిపై రావడంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా నర్సంపేటలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని పట్టణ ప్రజలు ఎన్నిసార్లు మున్సిపాలిటీ పాలకవర్గానికి, అధికారులకు తెలిపిన పట్టించు కోకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.