వరంగల్ జిల్లా దుగ్గొండి మండల గోబ్రియ తండాలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల గృహాలకు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ అజ్మీర దంజ్య నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు అజ్మీర వీరేశం, అజ్మీర తిరుపతి, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.