పండ్ల సాగుతో కాసుల పంట పండిద్దామనుకున్న ఉద్యాన రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే వరుస వర్షాలకు అరటి, మామిడి, బొప్పాయి ఇతర పండ్ల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను గురువారం దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో ఉద్యానవన అధికారిణి జ్యోతి పరిశీలించారు. నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో మామిడి, దుగ్గొండి, నర్సంపేటలో అరటి తోటలు పదుల ఎకరాల్లో దెబ్బతిన్నాయి.