
GOOD NEWS: నేడు 'తల్లికి వందనం' అమలు
ఎన్నికల ముందు హామీగా ఇచ్చిన ‘తల్లికి వందనం’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. గురువారం నాడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులను జమ చేయనుంది. రాష్ట్రంలో 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. సాంకేతిక కారణాల వల్ల జాబితాలో లేనివారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారికి ఇస్తామని సీఎం తెలిపారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అందించనుంది.