సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం మూడో రోజు శనివారం భక్తులతో కిక్కిరిపోయింది. వీకెండ్ కావటంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు కాళేశ్వరానికి తరలి వస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో కాళేశ్వరం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నేడు, రేపు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.