
మంచి క్రెడిట్ స్కోరు కావాలంటే ఏం చేయాలి..?
మంచి క్రెడిట్ స్కోరు కావాలంటే కొన్ని కీలక విషయాలు పాటించాలి. బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30% లోపే ఉండేలా చూసుకోవాలి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డు వంటివి కలిపి క్రెడిట్ మిక్స్ కలిగి ఉండాలి. తరచూ రుణాల కోసం దరఖాస్తు చేయకూడదు. అది స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే, తరచూ క్రెడిట్ స్కోరును తనిఖీ చేసి తప్పులుంటే వెంటనే సరిచేసుకోవాలి.