రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించి మిల్లర్ల దోపిడిని అరికట్టి సకాలంలో రైతులకు బోనసుతో కలిపి డబ్బులను అకౌంట్లో జమ చేయాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రతినిధి బృందం వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.