ముదిరాజులను బిసి డి నుంచి బిసి ఏ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలకు వినతిపత్రం సంబంధించిన పోస్టర్లను శనివారం నర్సంపేట లో కేంద్రంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చెయ్యాలని కోరారు.