నల్లబెల్లి: నిర్లక్ష్యం తో విద్యుత్ ఉద్యోగి కి తీవ్ర గాయాలు

53చూసినవారు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లైన్ తండాలో శనివారం విద్యుత్ ఉద్యోగి కరెంట్ షాక్ కు గురయ్యాడు. గ్రామంలో కరెంటు పనిచేస్తున్న నీలం శ్రీనివాస్ విద్యుత్ శాఖ లో పనిచేస్తూ సబ్ స్టేషన్ లో ఎల్ సి తీసుకున్నాడు. పనిచేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని అంబులెన్స్ లో హస్పిటల్ కు తరలించారు. జరిగిన ఘటన పై విద్యుత్ అధికారుల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బంధువులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్