నల్లబెల్లి: వ్యక్తి దారుణ హత్య

55చూసినవారు
నల్లబెల్లి: వ్యక్తి దారుణ హత్య
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో శనివారం రాత్రి బానోత్ కొమ్మలు(36) అనే వ్యక్తి హత్య కు గురయ్యారు. సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మొక్కజొన్న చేనులో కొమ్మలు మృతదేహం లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పొట్టలో దారుణంగా పొడిచి హత్య చేసినట్టు సమాచారం ఉంది. హత్యకు వివాహేతర సంబంధం కారణంగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్