వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది. నల్లబెల్లి మండలం లెంకలపల్లి గ్రామంలో ఈదురు గాలులతో కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కరెంట్ కట్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరమ్మతు చర్యలు చేపట్టారు.