
కరోనా కల్లోలం.. 10 మంది మృతి
దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కరోనా భారీన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా కేరళలో ఐదుగురు, ఢిల్లీలో ముగ్గురు, మహారాష్ట్రలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 7,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 2007, గుజరాత్లో 1441, ప.బెంగాల్లో 747, ఢిల్లీలో 682, మహారాష్ట్రలో 578, కర్ణాటకలో 573 యాక్టివ్ కేసులు ఉండగా, APలో 101, TGలో 9 నమోదయాయి.