వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లోని పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం పోలీసులు పట్టుకున్నారు.
తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్, 13 తులాల బంగారం, 30 తులాల వెండి రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ తో పాటు రెండు వేల నగదు సీజ్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఏడుగురి పై కేసు నమోదు, రిమాండ్ కు తరలించారు.