వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరన్న స్వామి బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని కురుమ కులస్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, బీరన్న స్వామికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీరన్న ఆలయ కమిటీ చైర్మన్ ఈర రాజ్ కుమార్, కురుమ సంఘం అధ్యక్షుడు డ్యాక శ్రీనివాస్, కుల పెద్దలు గౌరవ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.