వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్ ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ భవనాన్ని వినియోగంలోకి తెస్తామని టీపీసీసీ సభ్యుడు. రామానంద్ తెలిపారు. నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ భవనాన్ని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. గత ప్రభుత్వంలో కమ్యూనిటీ భవనం నిరాదరణకు గురైందని, రూ. 15 లక్షలతో ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు. భరత్ రెడ్డి, మనోహర్, మురళీ, భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.