నర్సంపేట: సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్

74చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 11 వ వార్డు లోని కూరగాయల మార్కెట్ పెద్ద కాలువ నుండి సంజీవిని ఆశ్రమం వరకు సిసి రోడ్ నిర్మాణ పనులను శనివారం స్థానిక కౌన్సిలర్ గంప సునిత రఘునాథ్ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. సంజీవని ఆశ్రమం నిర్వహకులు
డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు పనులు ప్రారంభించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గంప రాజేశ్వర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్