డిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తాలో శనివారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలలో ముందజలో వుండి ఢిల్లీ పీఠం కైవసం చేసుకొన్న సందర్బంగా బిజెపి శ్రేణులు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహా రాములు తదితరులు పాల్గొన్నారు.