
ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి
ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. అన్నమయ్య జిల్లా ఎం.రాచపల్లిలో ముగ్గురు చిన్నారులు ఈతకెళ్లి మృత్యువాతపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలోని రైస్ మిల్లులో ధాన్యం బస్తాల లోడు తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.