వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జోజిపేట తండాకు చెందిన లావుడ్యా భద్రు సోమవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు వద్ద ట్రాక్టర్ లో ధాన్యం బస్తాలతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాను పండించిన వరి ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నానని, మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతు భద్రును సముదాయించి పంపించారు.