వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. నగరంతో పాటు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్ష ప్రభావంతో నర్సంపేట పట్టణంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చేతికొచ్చే సమయంలో పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.