నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎన్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటాన్ని పూలమాలతో అలంకరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల కోసం దేశంలోనే మొదటి మహిళా విద్యాసంస్థలను స్థాపించారని అదేవిధంగా వితంతు మహిళలకు ఆశ్రమాలను స్థాపించారన్నారు.