బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేటలో బుధవారం రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డీ, మునిగాల వెంకట్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి తదితరులున్నారు. రజతోత్సవ సభ కు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.