వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి 7న హైదరాబాద్ నిర్వహించే లక్షల డప్పులు-వేల గొంతుల మహా కళ ప్రదర్శనను విజయవంతం చేయాలని సోమవారం కల్లెపెల్లి ప్రణయ్ దీప్, మిట్టపెల్లి సురేందర్ కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గూడెం నుంచి డప్పు తీసుకొని రావాలని మాదిగ మేధావులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.