

సాక్షి కార్యాలయం ఫర్నీచర్ దహనం వార్తల్లో వాస్తవం లేదు: డీఎస్పీ (VIDEO)
సాక్షి కార్యాలయంలో ఫర్నీచర్ కాలిపోయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఏలూరు DSP శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. గత 3 రోజులుగా అక్కడ బందోబస్తు కట్టుదిట్టంగా కొనసాగుతోందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ఏలూరు 3-టౌన్ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా అది ఓ షాపులో జరిగిన ఘటన అని తెలిపారు.