వరంగల్ జిల్లా నర్సంపేట మండల తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమితి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. డివిజన్ బాధ్యులు నరసయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నర్సంపేట మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు.