వరంగల్ జిల్లా ఖానాపురం మండలం లోని అశోక్ నగర్ లో గల దత్తసాయి, బాలాజీ రైస్ మిల్లులను శనివారం విజిలెన్స్ ఎస్పీ శశిధర్ రాజు నేతృత్వంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా అధికారులు మిల్లులలో ధాన్యం నిల్వలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. తనిఖీల లో విజిలెన్స్ ఓఎస్డీ లు ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి , డీఎస్పీ శేఖర్ రెడ్డి మరియు దుగ్గొండి సీఐ సాయి రమణ , ఖానాపూర్ ఎస్ ఐ రఘుపతి, సివిల్ సప్లై డిటి సంధ్యారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.