నర్సంపేట మండలం ఆకుల తండా గ్రామానికి చెందిన ఒక యువకుడు హైదరాబాద్ లోని ఒక బ్యాంకులో పీఓగా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆ యువకుడికి ఒక ఆగంతకుడు ఫోన్ చేసి రూ 3 లక్షలు ఇస్తే విలువైన సమాచారం ఇస్తా అనడంతో మొదట పట్టించుకోలేదు.తరువాత అతను చెప్పిన విషయాలు విని కుటుంబ సభ్యులకు తెలపగా వారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం మొత్తం బయట పడింది. పోలీసులు గురువారం ఆ యువకుడి భార్యతో పాటు సుపారీ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.