వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని హరిట్రేడర్స్ ఫర్టిలైజర్ షాపులో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. షాపులో అనుమతి లేకుండా అక్రమంగా ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నాడని తనిఖీలు నిర్వహించారు. పురుగుల మందులు ఆన్లైన్ లో బుక్ చేసి రైతులకు అమ్ముతున్నారని అధికారులు తెలిపారు. అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.