రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు తప్పవని బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చా నాయకులు అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చలో హైదరాబాద్ నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆ పార్టీ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తుందన్నారు.