నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు అపరిశుభ్రతకు నిలయంగా మారింది. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ నిండి రోడ్డుమీద నుండి ప్రవహిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతూ పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించిన ఎటువంటి ఫలితం లేదని స్థానికులు శనివారం వాపోతున్నారు. మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు అంటున్నారు.