Top 10 viral news 🔥

దారుణం.. యువతిని కత్తితో పొడిచి తాళి కట్టాడు!
ఓ ప్రేమోన్మాది యువతిని కత్తితో పొడిచి.. ఆపై తాళి కట్టాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట పడేవాడు. శనివారం పూర్ణిమపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మెడలో తాళి కట్టాడు. అనంతరం సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. ఆ తర్వాత అతనే ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ పూర్ణిమ ప్రాణాలు కోల్పోయింది. అభిషేక్ పరారీలో ఉన్నాడు.