డిసెంబర్ 14, 15వ తేదీల్లో విజయవాడలో నిర్వహించే భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కన్వీనర్ సమ్మెట వర్షన్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో యు.ఎస్.ఎఫ్.ఐ జాతీయ మహాసభల కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. అందరికీ సమాన విద్య అందేలా పాలకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు.