వరంగల్ జిల్లా నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తాటిపెళ్లి శివకుమార్ ను నెక్కొండ పీఎసీఎస్ చైర్మన్ మారం రాము ఆదివారం శాలువాతో సత్కరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చల్లా చెన్నకేశవరెడ్డి, అడ్వకేట్ కొమ్ము రమేష్ యాదవ్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, కారింగుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.