
తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపీ సింబల్ మార్పు
తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రాష్ట్ర భాషకు ప్రాధాన్యతనిస్తూ రూపీ సింబల్లో కీలక మార్పు చేశారు. రూపీ సింబల్ స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరాన్ని ఎంచుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈక్రమంలో ద్విభాషను మాత్రమే అమలు చేస్తామని చెప్పడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రూపీ సింబల్లోనూ మార్పు చేసింది.