దుగ్గొండి మండలం శంబయ్యపల్లికి చెందిన ప్రవళిక, ముదురుకోళ్ల సందీప్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని భర్త ప్రవళికను వేధించి పుట్టింటికి పంపించారు. 8 నెలల గర్భంతో ఉన్న ప్రవళిక ఈనెల 18న పురుగుల మందు తాగడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి బిడ్డను బయటికి తీశారు. యంజియంలో చికిత్స చేయిస్తుండగా ఈనెల18న పాప మృతి చెందింది. ప్రవళిక చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.