వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో పలు రైళ్ల హాల్టింగ్, స్టేషన్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిశారు. ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. శాతవాహన, చార్మినార్, నవజీవన్, షిరిడి, కరీంనగర్ సూపర్ ఫాస్ట్ తదితర రైళ్లను నెక్కొండలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.