ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలి

67చూసినవారు
ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలి
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈనెల 6న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ పిలుపునిచ్చారు. నర్సంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జావిద్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నర్సంపేట కేంద్రంగా 736 రోజులు దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ కోసం నిర్వహిస్తున్న సదస్సు ఉద్యమకారులు తరలిరావాలన్నారు.

సంబంధిత పోస్ట్