వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నరావుపేట గ్రామంలోని హర్టికల్చర్ రిసెర్చ్ సెంటర్ స్థలాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లబెల్లిలో హర్టికల్చర్ రిసెర్చ్ సెంటర్ మంజూరు చేసి సంవత్సరం పూర్తి అయ్యిందని, అభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. ఆయన వెంట నల్లబెల్లి మండల నాయకులు పాల్గొన్నారు.