ములుగు జిల్లా లోని రామప్ప దేవాలయాన్ని, సరస్సును విధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నల్లబెల్లి మండలం లో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో రామప్ప పరిసరాల్లో బొగ్గు మైనింగ్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకరించారని అన్నారు. రామప్ప చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఓపెన్ క్యాస్ట్లు చేయొద్దనే నిబంధనలు ఉన్నాయన్నారు.