అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.