లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

68చూసినవారు
లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండల కేంద్రంలోని వరంగల్ ఖమ్మం రహదారిపై బస్టాండ్ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ వ్యక్తిని లారీ (ఏపి37టిసి9549) డీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ సంఘటనతో గాయపడిన వ్యక్తిని వెంటనే స్థానికులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్