జనగాం జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామ ఉన్నత పాఠశాలకు 2001-2002 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు వాటర్ ప్యూరిఫయ్యర్ ను బహూకరించారు. గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 35 వేల రూపాయల విలువ చేసే వాటర్ ప్యూరిఫయ్యర్ ను అందించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిర్రు. సోమేశ్వర్, అనుముల. కుమార్, ఎల్లబోయిన. నాగరాజు, కొడిశాల. బాబు, సుదర్శన్, గోనె. అశోక్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.