పాలకుర్తికి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు

69చూసినవారు
పాలకుర్తికి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాలకుర్తి గ్రామ పంచాయతీ జిల్లా స్థాయి అవార్దు దక్కించుకుంది. గురువారం జనగాం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ల చేతుల మీదుగా గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారి జెట్టి జయంతి, కార్యదర్శి కపిలవాయి వెంకటేశ్వరాచారిలు అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్