అనుమతులేని వెంచర్ పై కలెక్టర్ కు పిర్యాదు

58చూసినవారు
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం నీర్మల గ్రామంలోని గత రెండు సంవత్సరాల క్రితం అనుమతులేని వెంచర్ 16 ఎకరాల భూమిలో
ఇష్టారాజ్యంగా కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ లేఔట్ కు ఎకరానికి 4 గుంటలు చొప్పున గ్రామపంచాయతీకి 1 ఎకరం 24 గుంటలు భూమిని గ్రామపంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసి అనుమతులు తీసుకోవలసి ఉందని తెలిపారు. భూమి ఇవ్వకుండా అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్