జనగామ జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల చౌరస్తాలో డా" బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి బిఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది.
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అంబేద్కర్ యువజన సంఘ నేతలు,
అనంతరం ఘర్షణ వాతావరణంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.