పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గిర్ని తండాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఇటుక బట్టి నుండి మట్టితో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్ ట్రక్కు మీదపడి మొండ్రాయి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కొడకండ్ల పోలీసులు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.