ఆడబిడ్డపై వల్గర్ గా మెసేజ్ లు పెడితే తాటతీస్తా: పాలకుర్తి ఎమ్మెల్యే

70చూసినవారు
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ ఝాన్సీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని, అనుక్షణం ప్రజల్లో ఉంటూ గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను తెలియజేయాలని, పాలకుర్తిలో ఏ ఆడబిడ్డపైన వల్గర్ గా మేసేజ్ లు పెట్టినా సహించేది లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్